myUpchar प्लस+ सदस्य बनें और करें पूरे परिवार के स्वास्थ्य खर्च पर भारी बचत,केवल Rs 99 में -

చాలా మంది మహిళలు, నిజానికి, వారి కుటుంబ సభ్యులు, మగ బిడ్డ పుట్టాలని రహస్యంగా కోరుకుంటూ ఉంటారు! నిజానికి జంటలు ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన బిడ్డను పొందడంపై దృష్టి పెట్టాలి, ఈ రోజుల్లోకూడా, భారతీయ సమాజంలో సాంప్రదాయక మరియు సాంఘిక కారణాల వలన మగపిల్లలు కావాలనే కోరికతో తమ లైంగిక చర్యను ప్రణాళిక చేసుకునే జంటలు ఉన్నారు. ఈ కోరికతో పాటుగా, ముసలమ్మల  కథలు కూడా వ్యాప్తి చెందాయి. మగపిల్లవాడి కనడం కోసం ఎలా గర్భం ధరించవచ్చో చెప్పే కథలు అవి. ఎప్పుడు సంభోగం జరపాలి?, ఏ ఆహారాలు తినాలి? ఏ బట్టలు ధరించాలి మొదలైన కథలు ....!

మగ పిల్లవాడు తమ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళతాడని మరియు వృద్ధాప్యంలో వారిని చూసుకుంటాడని తల్లిదండ్రులు మరియు సమాజం భావిస్తున్నందున ఇదంతా జరుగుతూ ఉంది.

ఈ రోజుల్లో విజ్ఞాన శాస్త్రం చాలా పురోగతి చెందింది కాబట్టి, శిశువు యొక్క లింగం శిశువు తల్లి ద్వారా కాక తండ్రి వీర్య కణం (స్పెర్మ్) ద్వారా ప్రభావితమవుతుందని మనందరికీ తెలుసు. కాని ఇంకా, అబ్బాయిని కనడం ఎలా? అనే విషయం మీద అంతర్జాలంలో మరియు బంధువులలో అనేక చిట్కాలు ఉన్నాయి! ఇప్పటికీ జాతకచక్రాలను విశ్వసించే సమాజంలో, ప్రజలు ఈ కథలను విశ్వసించడం అనేది ఆశ్చర్యం కలిగించే విషయమేమి కాదు.

బిడ్డకు జన్మనివ్వడానికి ప్రయత్నిస్తున్నవారు మరియు అబ్బాయిని కనాలనే ఉద్దేశ్యంతో ఉన్న స్త్రీలందరూ తెలుసుకోవలసిన కొన్ని అపోహలు ఈ క్రింద ఉన్నాయి. మగ బిడ్డను కనడం కోసం  మీ స్నేహితులు మరియు బంధువులు ఇచ్చిన అన్ని చిట్కాలతో పోల్చుకోవడానికి ఈ వ్యాసం మీకు సహాయపడుతుంది మరియు కథలు ఎల్లప్పుడూ నిజం కాదని తెలుసుకోవడానికి మీరు దీనిని చదవాలి.

(మరింత చదవండి: గర్భంలో మగపిల్లవాడు ఉన్నాడన్న సంకేతాల చుట్టూ ఉన్న అపోహలు)

 1. మగ సంతానం కోసం కోసం ఫలవంతమైన రోజులలో లైంగిక చర్య చేయడం - Timing sex around fertile days for baby boy in Telugu
 2. మగపిల్లవాడిని పొందటానికి శృంగార భంగిమ - Sex position to get a baby boy in Telugu
 3. మగపిల్లవాడిని కనడం కోసం యోని పిహెచ్‌ ని మార్చడం - Changing your vaginal pH to get pregnant with a baby boy in Telugu
 4. మగపిల్లవాడు పుట్టడానికి స్త్రీకి భావప్రాప్తి కలగాలి - Woman should have an orgasm to get a baby boy in Telugu
 5. మగ పిల్లవాడి కోసం కొన్ని ఆహారాలు తినాలి - Eating some foods to conceive a baby boy in Telugu
 6. మగపిల్లవాడిని కనడానికి శృంగారం యొక్క తరచుదనం - Frequency of sex to conceive a baby boy in Telugu
 7. మగబిడ్డ కోసం సప్లిమెంట్స్ మీకు సహాయపడతాయి - Supplements can help you conceive a baby boy in Telugu
 8. మగపిల్లవాడి కోసం కాఫీ - Coffee to conceive a baby boy in Telugu
 9. మగపిల్లవాడిని పొందడానికి దగ్గు సిరప్ తీసుకోవడం - Taking cough syrup to conceive a boy in Telugu
 10. మగ సంతానం కోసం అమావాస్య రోజున శృంగారం చేయండి - Have sex on new moon day to conceive a boy in Telugu
 11. మగ సంతానం కోసం అని చెప్పే కొన్ని ఇతర అపోహలు - Few other myths on how to conceive a boy in Telugu
 12. ఉపసంహారం - Bottom line on conceiving a baby boy in Telugu
 13. మగపిల్లవాడిని కనడం కోసం చిట్కాలు - అపోహలు మరియు వాస్తవాలు వైద్యులు

అపోహ

జానపదుల జ్ఞానం ప్రకారం, మగ శిశివు కోసం ఇచ్చే సర్వసాధారణమైన సూచనలలో ఇది ఒకటి.   మగ బిడ్డను పొందాలనుకునే జంటలు అండోత్సర్గముకి (ఒవ్యులేషన్) 12 గంటల ముందు సంభోగం జరిపేలా చూసుకోవాలి. ఒకవేళ ఆడపిల్ల కావాలంటే, అండోత్సర్గము జరగడానికి రెండు నుంచి నాలుగు రోజుల ముందు శృంగారం చేయాలి. మరియు ఈ ప్రణాలికను ఋతుక్రమములు నిర్దిష్టంగా  లేని వారు పాటించకూడదు.

వాస్తవం

అండోత్సర్గముకి సరిగ్గా 12 గంటల ముందు శృంగారం చేయడానికి అవకాశం లేదు. ఇంట్లో అండోత్సర్గము సమయం కనిపెట్టగల ఏ పద్ధతి ఖచ్చితమైనది కాదని పరిశోధన కనుగొంది. అండోత్సర్గముకి ముందు రెండు రోజులలో శృంగారానికి దూరంగా ఉండటం అంటే మీ అత్యంత ఫలవంతమైన (ఫెర్టైల్) రోజులను మీరు కోల్పోతున్నారని అర్థం. అంతేకాకుండా, గర్భాశయ శ్లేష్మంలో  అండము నాణ్యతగా ఉన్నప్పుడు శృంగారానికి దూరంగా ఉండటం అంటే అత్యంత సారవంతమైన సమయాన్ని నివారించడం అవుతుంది.

అపోహ

మగపిల్లవాడు కావాలంటే, డాగీ స్టైల్ వంటి సెక్స్ పొజిషన్లను ఎంపిక చేసుకోండి, అప్పుడు వీర్యం వీలైనంతగా గర్భాశయానికి దగ్గరగా వెళ్తుంది, తద్వారా Y- వీర్యకణాలు వేగంగా ప్రయాణించగల సౌలభ్యం ఉంటుంది. ఆడపిల్ల కావాలనుకుంటే, మిషనరీ స్థానంలో సెక్స్ చేయండి, తద్వారా  వీర్యం గర్భాశయానికి కొద్దిగా దూరంగా ఉంటుంది, అక్కడ యోని వాతావరణం కొంచెం ఎక్కువ ఆమ్లంగా (అసిడిక్ గా) ఉంటుంది.

వాస్తవం

నిర్దిష్ట వీర్య కణాలు అండం వరకు వేగంగా వెళ్ళడానికి శృంగార భంగిమ ప్రభావితం చూపడు. అయితే, X వీర్య  కణాలు Y- వీర్య కణాల కంటే వేగంగా ఈత కొడతాయని తెలిసింది.

అపోహ

మగపిల్లవాడు కావాలంటే, యోని యొక్క ఆల్కలైనిటీ ని పెంచడం కోసం బేకింగ్ సోడా కలిపిన నీటితో తరచుగా దౌచింగ్ (నీటిని గొట్టంతో చిమ్మేటట్లు చేయడం) చేయాలనీ చెప్తారు అది Y-స్పెర్మ్ కణాలకు ఒక ప్రయోజనాన్ని ఇవ్వడానికి పని చేస్తుందని సూచించబడుతుంది. ఎందుకంటే యోనిలో ఆమ్ల (అసిడిక్) వాతావరణం ఉంటే అమ్మాయి పుట్టడానికి అనుకూలంగా ఉంటుందని మరియు ఆల్కలీన్ వాతావరణం మగపిల్లవాడిని పొందే అవకాశాలను పెంచుతుందని నమ్ముతారు.

X- వీర్య కణాలు Y- వీర్య కణాల కంటే కొంచెం ఎక్కువ ఆమ్ల పరిస్థితులను తట్టుకోగలవని అని తెలిపిన ఇన్ విట్రో అధ్యయనాల నుండి ఇది వచ్చింది.

వాస్తవం

దౌచ్ చేయడం వల్ల యోని యొక్క సహజ పిహెచ్ బ్యాలెన్స్ కు భంగం కలుగుతుంది, ఇది యోనిలో చికాకు మరియు సంక్రమణకు కారణం కావచ్చు మరియు వీర్య కణాల మనుగడకు సహాయపడే సంతానోత్పత్తిని మెరుగుపరిచే గర్భాశయ శ్లేష్మానికి (cervical mucus) కూడా ఆటంకం కలిగించవచ్చు.

అపోహ

అబ్బాయిని కనాలనుకుంటే, స్త్రీకి భావప్రాప్తి కలగాలి, ఇది Y- వీర్య కణాలు మరింత వేగంగా ఈత కొట్టడానికి సహాయపడుతుంది. అమ్మాయి కావాలంటే, స్త్రీకి భావప్రాప్తి ఉండకూడదు.

వాస్తవం

పైన చెప్పినట్లుగా, సగటున X- క్రోమోజోమ్ కలిగిన వీర్య కణాల కంటే Y- క్రోమోజోమ్ కలిగిన వీర్య  కణాలు వేగంగా ఈత కొట్టవని సైన్స్ తెలిపింది. అదనంగా, భావప్రాప్తి కలుగడం లేదా కలగకపోవడం అనేది గర్భంలో ఏర్పడే పిండాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పే ఆధారాలు ఏవి లేవు.

అపోహ

పొటాషియం మరియు సోడియం అధికంగా ఉన్న ఆహారాలన్ని తింటే, మగపిల్లవాడిని కనే అవకాశం ఉంటుందని, కాల్షియం మరియు మెగ్నీషియం అధికంగా ఉన్న ఆహారాలన్ని తింటే, ఆడపిల్లని కనే అవకాశం ఉంటుందని చెప్పే కథలు మీరు వినే ఉంటారు. ఉదాహరణకు, అరటిపండ్లు అధికంగా తినడం వల్ల మగపిల్లవాడిని కనవచ్చు.

వాస్తవం

పురుషులు పిండం యొక్క లింగాన్ని ప్రభావితం చేస్తారు, మహిళలు కాదు. పురుషులు స్పెర్మ్‌ (వీర్యకణాన్ని) ను అందిస్తారు, దీనిలో X (అమ్మాయి) లేదా Y (అబ్బాయి) సెక్స్-లింక్డ్ క్రోమోజోమ్ ఉంటుంది. తండ్రి స్పెర్మ్ యొక్క X క్రోమోజోమ్, తల్లి యొక్క X క్రోమోజోమ్‌తో (ఆమె అండములోని) ఫలదీకరణం చెందినప్పుడు పిండంలో ఆడపిల్ల (XX) ఏర్పడుతుంది మరియు స్పెర్మ్ యొక్కY క్రోమోజోమ్, తల్లి యొక్క X క్రోమోజోమ్‌తో కలిస్తే, పిండంలో మగపిల్లవాడు (XY) ఏర్పడతాడు.

అపోహ

ముసలమ్మల మాటల ప్రకారం,మగపిల్లలు కావాలంటే పురుషులు ఎక్కువగా శృంగారంలో పాల్గొనాలి. ఎందుకంటే, తక్కువ స్పెర్మ్ కౌంట్ (వీర్యకణాల సంఖ్య) ఉన్న పురుషులకు ఆడపిల్ల పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరియు స్పెర్మ్ కౌంట్ ఎక్కువ ఉన్న పురుషులకు అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుందని విశ్వసిస్తారు.

వాస్తవం

శృంగారం చేయడం లేదా చేయకపోవడం అనేది వీర్యకణాల ఉత్పత్తిని లేదా అండంతో ఫలదీకరించే వీర్య కణ రకాన్ని ప్రభావితం చేయదు.

అపోహ

ఆన్‌లైన్ లేదా ఫార్మసీలలో లభించే శిశు లింగ ఎంపిక సప్లిమెంట్లను (baby gender selection supplements) రహస్యంగా ఉపయోగించే జంటలు చాలా మంది ఉన్నారు. భారతదేశంలో మొదటి సారి ఆడపిల్లను కన్న 60% మంది మహిళలు తమ రెండవ సంతానం కోసం లింగ ఎంపిక మందులు (sex selection drugs) తీసుకుంటారని అంచనా. ఈ మందులు వారి కోరిక ప్రకారం అబ్బాయి లేదా అమ్మాయిని కనడంలో సహాయపడతాయని చెప్తారు.

వాస్తవం

ఈ సప్లీమెంట్లలో కొన్ని మూలికలతో పాటు టెస్టోస్టెరాన్ మరియు ఫైటోఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల ఉనికిని శాస్త్రీయ ఆధారాలు కూడా వెల్లడించాయి. కానీ, ఈ మందులలో ఈస్ట్రోజెన్ మరియు స్టెరాయిడ్లు ఉన్నాయని తెలుస్తుంది, ఇవి పిల్లలలో వైకల్యం మరియు లోపాలను కలిగిస్తాయి.

అపోహ

మగపిల్లవాడిని పొందడంలో సహాయపడుతుందని చెప్పే చిట్కాలలో కాఫీ తాగడం ఒకటి. పురుషులు శృంగారానికి ముందు కాఫీ లేదా కెఫిన్ తీసుకోవాలని చెబుతారు. ఈ విధానం Y-క్రోమోజోమ్ గల వీర్య కణం అండంతో ఫలదీకరణం అయ్యే అవకాశాలను పెంచడంలో సహాయపడుతుందని ప్రతిపాదించబడింది తద్వారా అబ్బాయి పుట్టే అవకాశం ఉంటుంది.

వాస్తవం

ఈ వాస్తవాన్ని సమర్థించే ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు. ఒబెస్ట్రీషియన్లు మరియు గైనాకాలజిస్ట్లు మగపిల్లవాడు లేదా ఆడపిల్ల పుట్టడానికి సమానమైన అవకాశం ఉందని సూచిస్తున్నారు. కోరిక ప్రకారం గర్భస్తూ పిండాన్ని ఎంచుకోవడానికి సహాయపడే ఏ పద్ధతిని శాస్త్రీయ అధ్యయనం సమర్థించలేదు.

అపోహ

పిల్లలను ప్లాన్ చేసుకునేటప్పుడు మహిళలు దగ్గు సిరప్ తీసుకోవాలని చెప్పే చిట్కా మీలో చాలా మంది వినే ఉంటారు. దీని వెనుక ఉన్న సిద్ధాంతం ఏమిటంటే, దగ్గు సిరప్ గర్భాశయ శ్లేష్మం (cervical mucus) వదులుగా మరియు పలుచగా మారడంలో సహాయపడుతుంది, ఇది అండం దగ్గరకి వీర్యకణాలు సులభంగా చేరుకోవడంలో ఉపయోగపడుతుంది. గర్భాశయ శ్లేష్మం ద్వారా ఎక్కువ వీర్య కణాలు లోపలికి ప్రవేశిస్తే, మగపిల్లలు పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్తారు.

వాస్తవం

వైద్యుడు సూచించకుండా ఎటువంటి మందులు తీసుకోకూడదు.

అపోహ

అమావాస్య రోజున శృంగారం చేయడం వలన మగ పిల్లవాడు పుడతాడని చాలా చోట్ల చెప్తూ ఉంటారు. మరియు పౌర్ణమి రోజున శృంగారం చేయడం అమ్మాయి పుడుతుందని అంటారు.

వాస్తవం

ఒక అమ్మాయి విషయంలో ఇది నిజమని తేలినప్పటికీ, అమావాస్య రోజున శృంగారం మగపిల్లవాడిని పొందడంలో సహాయపడుతుందని చెప్పే శాస్త్రీయ అధ్యయనం ఏది లేదు. అంతేకాక, మీ అండోత్సర్గము సమయంలో ఈ నిర్దిష్ట రోజులు నెలలో ఎప్పుడో ఒకసారి వస్తాయి, కాబట్టి బిడ్డను కనాలనే కోరిక ఉన్నపుడు ఆ నిర్దిష్ట రోజుల కోసం వేచి ఉండి మీ ఫలవంతమైన రోజులను వృధా చేసుకోకూడదు.

 • మధ్యాహ్న సమయం మరియు నెలలో సరి (ఈవెన్) రోజులలో సంభోగం జరిపితే అమ్మాయి పుట్టే అవకాశం ఉంటుంది. అయితే, రాత్రి సమయంలో మరియు బేసి సంఖ్యల రోజులలో శృంగారం చేస్తే అబ్బాయిని పొందే అవకాశం ఉంటుంది.
 • మీ భర్త బిగుతుగా ఉండే దుస్తులు కాకుండా బాక్సర్లు (నిక్కర్లు) మరియు వదులుగా ఉండే ప్యాంటు ధరించడం ద్వారా తన యొక్క వృషణాలను చల్లగా ఉంచుకుంటే మగ పిల్లవాడు పుట్టే అవకాశం ఉంటుంది.
 • మగ పిల్లవాడిని కనాలనుకుంటే స్త్రీ తన ఉదయపు అల్పాహారాన్నిమానకూడదు
 • మగ పిల్లవాడిని కనాలనుకుంటే స్త్రీ తను తీసుకునే ఆహార పరిమాణాన్ని పెంచుకోవాలి.

ఈ ముసలమ్మల కథలు పని చేసినా, చేయకపోయినా, శిశువు యొక్క లింగ ఎంపికను కొంతవరకు ప్రభావితం చేసే కొన్ని ఆధునిక సాంకేతికతలు ఖచ్చితంగా ఉన్నాయి. ఈ విధానాలు తండ్రి స్పెర్మ్ యొక్క X మరియు Y- క్రోమోజోములు ద్వారా లింగం నిర్ణయించబడుతుందనే సిద్ధాంతంపై ఆధారపడి ఉంటాయి. ఈ అత్యాధునిక పద్ధతుల వాడకంతో, X మరియు Y- క్రోమోజోమ్‌లను ఇన్ విట్రో ద్వారా వేరు చేసి కృత్రిమంగా ఫలదీకరణం చేయవచ్చు. కానీ నైతిక కారణాల దృష్ట్యా పుట్టబోయే బిడ్డ లింగాన్ని ఎంచుకోవడం నైతికంగా పరిగణించబడదు.

మరియు ముఖ్యంగా, మన సమాజం, ఆడపిల్ల లేదా మగపిల్లవాడు ఎవరైనా పిల్లలు దేవుని బహుమతి అని అర్థం చేసుకోవాలి.

Dr.Priyanka Trimukhe

Dr.Priyanka Trimukhe

General Physician
3 वर्षों का अनुभव

Dr. Nisarg Trivedi

Dr. Nisarg Trivedi

General Physician
1 वर्षों का अनुभव

Dr MD SHAMIM REYAZ

Dr MD SHAMIM REYAZ

General Physician
7 वर्षों का अनुभव

Dr. prabhat kumar

Dr. prabhat kumar

General Physician
1 वर्षों का अनुभव

और पढ़ें ...

References

 1. Sarkar M, Biswas NM. Influence of moonlight on the birth of male and female babies. Nepal Med Coll J. 2005 Jun;7(1):62-4. PMID: 16295726
 2. Larissa Hirsch. Pregnancy Myths and Tales. The Nemours Foundation [Internet]
 3. Perry DF, DiPietro J, Costigan K. Are women carrying "basketballs" really having boys? Testing pregnancy folklore. Birth. 1999 Sep;26(3):172-7. PMID: 10655817
 4. ResearchGate. Sex selection drugs cause tens of thousands of stillbirths in India. [Internet]
 5. Office on women's health [internet]: US Department of Health and Human Services; Douching
ऐप पर पढ़ें