myUpchar प्लस+ सदस्य बनें और करें पूरे परिवार के स्वास्थ्य खर्च पर भारी बचत,केवल Rs 99 में -

కాలేయ వైఫల్యం అంటే ఏమిటి ?

కాలేయం మన శరీరంలో అనేక విధులు నిర్వహిస్తుంది. ఇది రక్తాన్ని వడగట్టుతుంది (ఫిల్టర్ చేయడం), ఆహారాన్ని ఉపయోగపడే శక్తిగా మార్చేస్తుంది మరియు రక్షణాత్మక చర్యను చేపడుతుంది. పేర్కొన్న ఈ విధుల్లో కొన్నింటిని లేదా అన్నింటినీ కాలేయం చేయలేక పోయినపుడు సంభవించే పరిస్థితినే “కాలేయ వైఫల్యం” అంటారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కాలేయ వైఫల్యం రెండు ప్రధాన రకాలు: తీవ్రమైన కాలేయ వైఫల్యం మరియు దీర్ఘకాల వైఫల్యం.

 • తీవ్రమైన కాలేయ విఫలం అకస్మాత్తుగా ప్రారంభమవుతుంది- కొన్ని రోజులు లేదా వారాలలో సంభవిస్తుంది. లక్షణాలు:
  • చర్మం మరియు కళ్ళు పచ్చబడడం(కామెర్లు)
  • వికారం మరియు వాంతులు
  • అలసట మరియు గందరగోళం
  • తీవ్రమైన కాలేయ వైఫల్యం మెదడు దెబ్బతినడానికి కారణమవుతుంది, దీన్నే “సెరిబ్రల్ ఎన్సెఫలోపతి” అని అంటారు. పిలవబడుతుంది, ఈ వ్యాధి స్థలం మరియు సమయం యొక్క విన్యాసాన్ని కోల్పోయేటందుకు కారణమవుతుంది.
 • దీర్ఘకాలిక కాలేయ వైఫల్యం నెలలు లేదా సంవత్సరాలు పట్టినా ఎలాంటి  లక్షణాలను చూపించకపోవచ్చు. తీవ్రమైన కాలేయ వైఫల్యం యొక్క లక్షణాలతో పాటు, గోచరించే ఇతర వ్యాధి చిహ్నాలు ఇలా ఉంటాయి:
  • వాపుకు కారణమైన కాళ్ళలో ద్రవం నిలవడం
  • జలోదరము లేక పొత్తి కడుపులో ద్రవం జమగూడడం (జలోదరం)
  • బరువు నష్టం
  • నిరంతర రక్తస్రావం (స్పాంటేనియస్ బ్లీడింగ్)

దీర్ఘకాలిక కాలేయ వైఫల్యం అని పిలువబడే మూడవ రకం ఇటీవలే గుర్తించబడింది, దీర్ఘకాలిక కాలేయ వైఫల్యంలో కాలేయ పనితీరు ఆకస్మికంగా క్షీణించడం వలన ఇది అతిశయోక్తిగానే గోచరిస్తుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

 • తీవ్రమైన కాలేయ వైఫల్యానికి కారణాలు:
  • మూర్ఛవ్యాధి కిచ్చే మందులైన యాంటిఎపిలెప్టిక్స్ వంటి కొన్ని మందుల యొక్క దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్)
  • హెపటైటిస్ బి  లేదా హెపటైటిస్ సి వ్యాధి వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు
  • విష పదార్ధాలు తీసుకోవడం
  • కొన్నిసార్లు, క్యాన్సర్ కూడా కాలేయ వైఫల్యాన్ని కలిగిస్తుంది
  • మూలికలతో కూడిన మందులు (herbal preparations)
 • దీర్ఘకాలిక కాలేయ వైఫల్యానికి కారణాలు:
  • దీర్ఘకాల మద్యపాన వ్యసనం
  • హెపాటిక్ సిర్రోసిస్
  • ఆటో ఇమ్యూన్ హెపటైటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు
  • జన్యుపరమైన వ్యాధులు
  • పోషకాహార లోపం (malnourishment)

దీనిని ఎలా నిర్ధారణ  చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

మీరు పైన పేర్కొన్న లక్షణాలతో వైద్యుని సంప్రదించినప్పుడు, అతను / ఆమె మీరు అంతవరకూ తీసుకున్న మందులు, మీరు మద్యపానం చేసేట్టయితే మీరు ఎంత మద్యం తాగుతారు మరియు జన్యుపరమైన అనారోగ్యాల చరిత్రను పరిశీలిస్తారు.

 • ఒక జీవాణుపరీక్ష (బయోప్సీ)తో పాటు సాధారణ రక్త పరీక్ష కాలేయ రుగ్మతను నిర్ధారిస్తుంది.
 • పొత్తికడుపు అల్ట్రాసౌండ్, CT స్కాన్ మరియు MRI వంటి కొన్ని ఇతర పరీక్షల ద్వారా వైద్యుడు కాలేయపు ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి సహాయపడతాయి.

చికిత్సలో అంతర్లీన వ్యాధికారణానికి చికిత్స చేయడం, మరియు వ్యాధి లక్షణాలను సరిచేసి రోగిని స్థిరమైన స్థితికి తీసుకురావడం జరుగుతుంది.

 • ఒక ఔషధం కాలేయ (హెపాటిక్) వైఫల్యాన్ని కల్గించి ఉంటే, ఆ ఔషధం కల్గించిన  విరుద్ధ ప్రభావాలను తిప్పికొట్టేందుకు దానికి బదులు ఇతర ఔషధాలను సేవింపజేయడం జరుగుతుంది.
 • కాలేయంలో ఒక భాగం మాత్రమే దెబ్బతిని ఉన్నట్లయితే, ఆ భాగాన్ని తొలగించివేయవచ్చు, అటుపై కాలేయం పునరుత్పత్తి చేస్తుంది.
 • కాలేయ వైఫల్యం సరిచేయలేని కారణవల్ల సంభవించినట్లైతే, అందుకు కాలేయ మార్పిడి మాత్రమే ప్రత్యామ్నాయ పరిష్కారంగా ఉంటుంది.
 • చికిత్సకు అదనంగా ఆహారం మరియు జీవనశైలి మార్పులు అవసరమవుతాయి.
 1. కాలేయ వైఫల్యం కొరకు మందులు
 2. కాలేయ వైఫల్యం వైద్యులు
Dr. Mahesh Kumar Gupta

Dr. Mahesh Kumar Gupta

गैस्ट्रोएंटरोलॉजी

Dr. Raajeev Hingorani

Dr. Raajeev Hingorani

गैस्ट्रोएंटरोलॉजी

Dr. Vineet Mishra

Dr. Vineet Mishra

गैस्ट्रोएंटरोलॉजी

కాలేయ వైఫల్యం की जांच का लैब टेस्ट करवाएं

LFT ( Liver Function Test )

25% छूट + 5% कैशबैक

కాలేయ వైఫల్యం కొరకు మందులు

కాలేయ వైఫల్యం के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine Name
Ursocol खरीदें
Udiliv Tablet खरीदें
Udimarin खरीदें
Actimarin खरीदें
Gemiuro Plus खरीदें
Udimarin Forte खरीदें
Udiplus खरीदें
Ulyses Plus खरीदें
Udibon खरीदें
Urdohep Sl खरीदें
Ursetor Plus खरीदें
Ursodox Plus खरीदें
Ursokem Plus खरीदें
Ursolic Plus खरीदें
Actibile खरीदें
Golbi खरीदें
Sorbidiol खरीदें
Udihep खरीदें
Ulyses खरीदें
Ursetor खरीदें
Ursokem खरीदें
और पढ़ें ...
ऐप पर पढ़ें