myUpchar प्लस+ सदस्य बनें और करें पूरे परिवार के स्वास्थ्य खर्च पर भारी बचत,केवल Rs 99 में -

తలకు గాయం అంటే ఏమిటి?

తల, నెత్తి, లేదా మెదడుకు గాయం కావడాన్ని”తలకు గాయం” గా సూచిస్తారు. తలకు గాయాలు అంటే గాయంవల్ల తలపై తేలికపాటి బుడిపె కట్టడం నుండి గాయంవల్ల తాత్కాలికంగా స్పృహ కోల్పోయే (కంకషన్)  తీవ్రరూప ఆఘాతం వరకూ పరిగణించొచ్చు. లేదా గాయంవల్ల పుర్రెకు పగులు లేక విరుపు (ఫ్రాక్చర్) ఏర్పడడమూ జరుగుతుంది .

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

తలకయిన గాయం యొక్క తీవ్రత మీద ఆధారపడి ఆ వ్యక్తి తలగాయం నొప్పి లక్షణాలు మారుతున్న ప్రమాణాల్లో ఉంటాయి. ఈ తలగాయం నొప్పి లక్షణాలు తేలికపాటివిగా, మితమైనవిగా లేదా తీవ్రమైనగా కూడా ఉండవచ్చు.

 • తేలికపాటి తలగాయం లక్షణాలు
  • తలపై చర్మ గాయము లేదా బుడిపె
  • చర్మంపై తెగిన గాటు (కట్)
  • తలనొప్పి
  • కాంతి సున్నితత్వం (ఫోటోఫోబియా)
  • వికారం
  • గందరగోళం
  • తల తిప్పడం లేక తలా తేలిపోతున్నట్లనిపించడం (Lightheadedness)
  • నిద్ర నమూనాలో మార్పులు
  • దృష్టి అస్పష్టత ఏర్పడ్డం
 • మితమైన తలగాయం లక్షణాలు
  • తాత్కాలికంగా స్పృహ తప్పడం
  • తీవ్రమైన తలనొప్పి
  • వికారం మరియు వాంతులు
  • పాలిపోయిన చర్మం
  • చిరాకు లేదా ప్రవర్తనా మార్పులు
  • బహిర్గతమైన గాయం (open wound)
 • తీవ్రమైన తలగాయం లక్షణాలు
  • స్పృహ కోల్పోవడం
  • కోమా స్థితి (Comatose state)
  • మూర్చ
  • మాట్లాడేటపుడు తడబడ్డం (dysarthria or slurring of speech)
  • కనులు (కనుపాపలు) తెలేయడం (శూన్యంలోకి చూస్తూ ఉండిపోవడం).
  • తలలోకి విదేశీ వస్తువు చొరబడ్డం (foreign object penetrating the head)
  • ప్రతిస్పందనా లోపం (Vegetative state)

తలకు గాయం అవడానికి గల ప్రధాన కారణాలు ఏమిటి?

తలకు అయ్యే గాయానికి కారణాలు వివిధ రకాలుగా ఉంటాయి. పిల్లలు మరియు పెద్దలకు అయ్యే తలగాయాలకు వివిధ కారణాలు ఉన్నాయి. పిల్లలలో అయితే ఈ కారణాలు ఎత్తు నుండి పడడం, హింసకు లోనవడం  కావచ్చు లేదా క్రీడల సంబంధిత గాయాలువల్ల కావచ్చు. ఇక పెద్దల విషయంలో రహదారిలో వాహన ప్రమాదంలో తలకు గాయమవడం కావచ్చు, భౌతికంగా దాడికి గురవడం, లేదా హింసకు లోనవడం, పడడం లేదా క్రీడా సంబంధమైన గాయాల వల్ల తలకు గాయం కావచ్చు.

తలకు గాయం అయిందని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

గ్లాస్గౌ కోమా స్కేల్ (జిసిఎస్-దీనితో చేతనావస్థను కొలవచ్చు) లతో కూడిన పూర్తిస్థాయి వైద్య (క్లినికల్) పరీక్ష తల గాయం స్థాయిని లెక్కకట్టడంలో సహాయపడుతుంది. GCS లో తక్కువ స్కోర్లు తీవ్రమైన గాయాన్ని సూచిస్తుండగా ఎక్కువ స్కోరు తీవ్రత తక్కువున్నా గాయాన్ని సూచిస్తుంది. కొన్నిసార్లు, కోమా స్థితి కారణంగా వైద్య చరిత్రను పొందడం కష్టం. మెదడు కణాలకు అయిన గాయంయొక్క స్థాయిని మరియు తలగాయం యొక్క విస్తరణను తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు తప్పనిసరి. ఆ పరీక్షలు కిందివిధంగా ఉంటాయి.:

 • కంప్యూటెడ్ టొమోగ్రఫీ (CT) స్కాన్: ఈ పరీక్ష పుర్రెకు అయిన విరుపులను లేక పగుళ్లను (fractures), పుర్రెలో రక్తస్రావం, మరియు కణజాల వాపును చూడ్డానికి, గుర్తించడానికి సహాయపడుతుంది.  
 • మాగ్నెటిక్ రెసోనాన్స్ ఇమేజింగ్ (MRI) స్కాన్: ఈ పరీక్షను CT స్కాన్‌తో పోలిస్తే దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. మరియు MRI పరీక్షవల్ల ఎక్కువ ఖచ్చితత్వం లభిస్తుంది.

స్వల్పంగా అయిన తలగాయానికి నొప్పి తెలియకుండా ఉండేందుకోసం సాధారణ నొప్పినివారిణా మందుల్ని (అనాల్జెసిక్స్) (ఐస్పాక్ వాడకంతో బాటుగా) సేవించడం ఉంటుంది. ఇక ఓ మోస్తరు మితమైన తలగాయాలకు మరియు తీవ్రమైన తలగాయాలకు సాధారణమైన మందులసేవనం నుండి శస్త్రచికిత్స వరకు అవసరమవ్వచ్చు లేదా, కొన్నిసార్లు, అత్యవసర వార్డ్కుకు చికిత్స కోసం చేర్చాల్సిన అవసరం కూడా రావచ్చు.

తలకైన గాయానికి కింది చికిత్స పద్ధతులుంటాయి:

 • మూర్ఛ రాకుండా యాంటీ-సీజర్ ఔషధాలు - తలకు గాయాలైనపుడు మూర్ఛ రావడమనేది సాధారణ లక్షణం మరియు దీనివల్ల మెదడుకు దెబ్బతగిలే ప్రమాదముంది గనుక మూర్ఛ రాకుండా ఉండేందుకు యాంటీ-సీజర్ ఔషధాలు సేవించడంవల్ల గొప్ప సహాయంగా ఉంటుంది.
 • మూత్రకారక మందులు (Diuretics) - కొన్ని రకాల తల గాయాలు మెదడు చుట్టూ వాపును కలుగజేస్తాయి; మూత్రకారక మందులసేవనం ఈ మెదడు వాపును తగ్గిస్తుంది మరియు పీడన లక్షణాలను (pressure symptoms) తగ్గించడంలో సహాయపడుతుంది.
 • కామాస్థితిని-ప్రేరేపించే మందులు - మెదడు తనకు తానుగా (స్వంతంగా)  కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నపుడు, అందుకు గాను అదనపు ఆక్సిజన్‌ను ఉపయోగించుకోవడం మొదలవుతుంది. అయినప్పటికీ, తలకైన గాయం కారణంగా రక్త నాళాలు బాధింపబడి పనిచేయకపోవడంవల్ల మెదడు తగినంత ఆక్సిజన్‌ను పొందలేకపోవచ్చు, మరియు ఈ పరిస్థితి మెదడు కణాల్ని మరింతగా గాయపర్చడం జరిగి మెదడులోని కణాల మరణానికి కారణం కావచ్చు. కాబట్టి, మెదడు మరింతగా గాయం కాకుండా నివారించడానికి, కోమాని ప్రేరేపించే మందుల్ని మెదడు కణాల పనితీరును తాత్కాలికంగా తగ్గించడానికి ఉపయోగిస్తారు.

తల గాయాలకు చేసే శస్త్ర చికిత్సలో కింది చర్యలుంటాయి:

 • పుర్రె పగుళ్లకు (skull fractures) మరమ్మత్తులు చేయడం
 • మెదడులో గాయంకారణంగా  తెగి స్రవిస్తున్న మెదడు రక్తనాళాల్ని కలిపి కుట్టడం
 • మెదడుపై ఒత్తిడిని తగ్గించడానికి పుర్రెలో ఒక కిటికీ ని సృష్టించడం

తలకైనా గాయానికి శస్త్రచికిత్స మరియు మందులు కాకుండా, మెదడు దెబ్బతిన్న కారణంగా దెబ్బ తిన్న మెదడు మరియు అవయవాల పనితీరుకు పునరావాసం కల్పించాలి. పునరావాస కాలంలో ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, కౌన్సిలింగ్ మరియు రిక్రెషనల్ థెరపీ ఉంటాయి.

 1. తలకు గాయం కొరకు మందులు
 2. తలకు గాయం వైద్యులు
Dr.Priyanka Trimukhe

Dr.Priyanka Trimukhe

General Physician
3 वर्षों का अनुभव

Dr. Nisarg Trivedi

Dr. Nisarg Trivedi

General Physician
1 वर्षों का अनुभव

Dr MD SHAMIM REYAZ

Dr MD SHAMIM REYAZ

General Physician
7 वर्षों का अनुभव

Dr. prabhat kumar

Dr. prabhat kumar

General Physician
1 वर्षों का अनुभव

తలకు గాయం కొరకు మందులు

తలకు గాయం के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine Name
Nootropil खरीदें
Citilin P खरीदें
Citimac P खरीदें
Citinerve P खरीदें
Clinaxon P खरीदें
Cognipil Plus खरीदें
Dalus Forte खरीदें
N Citi Plus खरीदें
Neuciti Forte खरीदें
Neuciti Plus खरीदें
Neurocetam Plus खरीदें
Nutam Plus खरीदें
Prexaron Plus खरीदें
Somazina Plus खरीदें
Storax Pr खरीदें
Cerecetam खरीदें
Strocoz Plus खरीदें
Flocetam खरीदें
Strolife खरीदें
Neetam खरीदें
Strolin P खरीदें
Neurocetam खरीदें
Strozina Plus खरीदें
Neurofit खरीदें
और पढ़ें ...
ऐप पर पढ़ें