myUpchar प्लस+ सदस्य बनें और करें पूरे परिवार के स्वास्थ्य खर्च पर भारी बचत,केवल Rs 99 में -

బెల్స్ పాల్సి ముఖ పక్షవాతం అంటే ఏమిటి?

బెల్స్ పాల్సి  ముఖ పక్షవాతం అనేది ఒక వైపు ముఖ కండరాలు బలహీనంగా మారడం లేదా పక్షవాతానికి గురిఅయ్యే  ఒక రకమైన ముఖ పక్షవాతం. ఈ కండరాలకు సరఫరా అయ్యే ముఖ నరాలు దెబ్బతినడం వలన ఇది ఏర్పడుతుంది. అయినప్పటికీ, కండరాలు తాత్కాలికంగా మాత్రమే ప్రభావితమవుతాయి, మరియు ఈ పరిస్థితి చికిత్సతో పూర్తిగా పరిష్కారమవుతుంది .

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

 • బెల్స్ పాల్సిలో సాధారణంగా ముఖంలో ఒక వైపు కండరాలు మాత్రమే ప్రభావితం అవుతాయి. కేసుల్లో దాదాపు 1% లో మాత్రమే, ప్రభావం ద్వైపాక్షికంగా ఉంటుంది.

 • ముఖ నరాలచే నియంత్రించబడే కదలికలు ప్రభావితమయ్యాయి. రోగులు కళ్ళు రెప్పలు మూయడం, తెరవడంతో కష్టపడతారు, ప్రభావిత వైపున నోరు తెరవడం, నవ్వడం మరియు నమలడంలో ఇబ్బంది పడతారు.

 • ముఖంలో ఆ వైపున, ముఖ్యంగా దవడ మరియు తలలలో నొప్పి ఉండవచ్చు.

 • కండరాల బలహీనత కారణంగా నోటి మూలలో నుండి ఉమ్మి జారిపోతుంది మరియు కనురెప్పలు వేలాడిపోతాయి.

 • నాలుక ముందు భాగంలో రుచి అనుభూతిని కూడా ప్రభావితం చేయవచ్చు.

బెల్స్ పాల్సికి ప్రధాన కారణాలు ఏమిటి?

బెల్స్ పాల్సికి ఖచ్చితమైన కారణం తెలియదు; అయినప్పటికీ, అనేక వైరల్ సంక్రమణలు ప్రేరేపిస్తాయి అని చెప్పబడుతున్నాయి. వీటిలో హెర్పెస్ సింప్లెక్స్ (herpes simplex), హెర్పెస్ జోస్టర్ (herpes zoster), హెచ్ఐవి (HIV), సైటోమెగలోవైరస్ (cytomegalovirus) మరియు ఎప్స్టీన్ బార్ వైరస్ (Epstein Barr virus) ఉన్నాయి.

ఈ వ్యాధికి ప్రమాద కారకాలు:

 • మధుమేహం
 • గర్భం, ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో
 • వ్యాధి ఉన్న కుటుంబ చరిత్ర

గాయం, వాపు లేదా ముఖ నరాలకు హాని కలిగించే ఏదైనా కారణం ముఖ పక్షవాతానికి దారి తీస్తుంది.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

నిర్ధారణకు, భౌతిక మూల్యాంకనంతో పాటు ఇమేజింగ్ మరియు రక్త పరీక్షలు కూడా అవసరం.

 • వైద్యులు లక్షణాల ఆధారంగా ముఖాన్ని పరిశీలిస్తారు, మరియు కనురెప్పలు వాలిపోవడం, లాలాజలము జారిపోవడం, వంటి సంకేతాలను తనిఖీ చేస్తారు.
 • ఎంఆర్ఐ (MRI) లేదా సిటి (CT)స్కాన్ వంటి ఇమేజింగ్ పద్ధతులు ముఖ నరాల యొక్క స్థితిని చూడటానికి సహాయం చేస్తాయి.
 • వైద్యులు వైరల్ సంక్రమణను (infection) అనుమానించినట్లయితే, దానిని నిర్ధారించడానికి రక్త పరీక్షఅవసరమవుతుంది.
 • అఘాతం, లైమ్ వ్యాధి మరియు మెదడు కణితులు వంటి ఇతర సమస్యలను మినహాయించి రోగనిర్ధారణ అనేది ఉంటుంది.

బెల్స్ పాల్సికి సంబంధించిన చికిత్స గుర్తించిన కారణాలు లేదా ప్రమాద కారకాలపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.

 • కోర్టికోస్టెరాయిడ్స్ (corticosteriods) ఈ స్థితికి చికిత్స చేయడానికి ఉపయోగించే ప్రామాణిక మందులు. అవి 6 నెలల వ్యవధిలో ఉపశమనం కల్పిస్తాయి. అయినప్పటికీ, ఈ సమస్య మొదట్లో స్టెరాయిడ్లతో చికిత్స ప్రారంభించటం చాలా ముఖ్యం.
 • వైరస్ కారణం అని అనుమానించబడితే, యాంటీవైరల్ మందులు ఇవ్వబడతాయి.
 • మందులతో పాటు, ఫిజియోథెరపీ ద్వారా కండరాల వ్యాయామాలు కూడా సూచించబడతాయి.
 • తీవ్రమైన సందర్భాల్లో, నాడి అణిచివేయబడిన లేదా గాయంతో ప్రభావితం ఐనా, శస్త్రచికిత్సా విధానం ముఖ పక్షవాతానికి ఉపశమనం కలిగించవచ్చు.
 • ఈ పరిస్థితి కొన్ని నెలలలో పరిష్కరించబడుతుంది అరుదుగా పునరావృతమవుతుంది.
 1. బెల్స్ పాల్సి ముఖ పక్షవాతం కొరకు మందులు
 2. బెల్స్ పాల్సి ముఖ పక్షవాతం వైద్యులు
Dr. Sushma Sharma

Dr. Sushma Sharma

न्यूरोलॉजी

Dr. Swati Narang

Dr. Swati Narang

न्यूरोलॉजी

Dr. Megha Tandon

Dr. Megha Tandon

न्यूरोलॉजी

బెల్స్ పాల్సి ముఖ పక్షవాతం కొరకు మందులు

బెల్స్ పాల్సి ముఖ పక్షవాతం के लिए बहुत दवाइयां उपलब्ध हैं। नीचे यह सारी दवाइयां दी गयी हैं। लेकिन ध्यान रहे कि डॉक्टर से सलाह किये बिना आप कृपया कोई भी दवाई न लें। बिना डॉक्टर की सलाह से दवाई लेने से आपकी सेहत को गंभीर नुक्सान हो सकता है।

Medicine Name
Wysolone खरीदें
Gatiquin P खरीदें
Predzy खरीदें
Gatsun P खरीदें
Siogat P खरीदें
Zengat P खरीदें
Z Pred खरीदें
Gate Pd खरीदें
Gate P P खरीदें
4 Quin Pd खरीदें
Apdrops Pd खरीदें
Combace खरीदें
Emsolone खरीदें
Mo 4 Pd खरीदें
Kidpred खरीदें
Methpred खरीदें
Moxipred खरीदें
Omnacortil खरीदें
Omnacortil Forte खरीदें
Moxigram P खरीदें
Prednisolone Acetate (Alcon Lab) खरीदें
Occumox P खरीदें
Prednisolone Acetate (Aller) खरीदें
Predone खरीदें

References

 1. The New England Journal of Medicine .Early Treatment with Prednisolone or Acyclovir in Bell's Palsy. Massachusetts Medical Society
 2. Science Direct (Elsevier) [Internet]; Herpes simplex virus as cause of bell's palsy
 3. Zaki MA, Elkholy SH, Abokrysha NT, Khalil AS, Nawito AM, Magharef NW, Kishk NA. Prognosis of Bell Palsy: A Clinical, Neurophysiological, and Ultrasound Study. J Clin Neurophysiol. 2018 Nov;35(6):468-473. PMID: 30387782
 4. Healthdirect Australia. Bell’s palsy. Australian government: Department of Health
 5. National institute of neurological disorders and stroke [internet]. US Department of Health and Human Services; Bell's Palsy Fact Sheet
और पढ़ें ...
ऐप पर पढ़ें